Mon Mar 23 2026 05:11:04 GMT+0530 (India Standard Time)
వైసీపీతో పొత్తు లేదు
వైసీపీతో తాము పొత్తు పెట్టుకునేది లేదని బీజేపీ ఏపీ ఇన్ ఛార్జి సునీల్ దియోధర్ తెలిపారు. తాము ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. [more]
వైసీపీతో తాము పొత్తు పెట్టుకునేది లేదని బీజేపీ ఏపీ ఇన్ ఛార్జి సునీల్ దియోధర్ తెలిపారు. తాము ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. [more]

వైసీపీతో తాము పొత్తు పెట్టుకునేది లేదని బీజేపీ ఏపీ ఇన్ ఛార్జి సునీల్ దియోధర్ తెలిపారు. తాము ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుందన్నారు. బీజేపీ ఒక రాజధానికి అనుకూలమని ఆయన చెప్పారు. శాసనమండలి రద్దును కూడా ప్రభుత్వం ఏకపక్షంగా చేసిందన్నారు సునీల్ దియోధర్. పార్లమెంటులో, రాజ్యసభలో సీఏఏ, ఎన్సార్సీలకు అనుకూలంగా ఓటు వేసి, ఇప్పుడు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎలా ర్యాలీలు చేస్తారని సునీల్ దియోధర్ ప్రశ్నించారు. తాము, జనసేన కలసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి పోటీ చేస్తామని చెప్పారు.
Next Story