Wed Mar 18 2026 23:52:16 GMT+0530 (India Standard Time)
సుజనా ఏందిది..??
బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులో మాజీకేంద్ర మంత్రి సుజనా చౌదరి సీబీఐ విచారణకు హాజరుకాలేదు. ఆయన కు బెంగుళూరులోని తమ కార్యాలయంలో శుక్రవారం విచారణకు హాజరుకావాలని సీబీఐ [more]
బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులో మాజీకేంద్ర మంత్రి సుజనా చౌదరి సీబీఐ విచారణకు హాజరుకాలేదు. ఆయన కు బెంగుళూరులోని తమ కార్యాలయంలో శుక్రవారం విచారణకు హాజరుకావాలని సీబీఐ [more]

బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులో మాజీకేంద్ర మంత్రి సుజనా చౌదరి సీబీఐ విచారణకు హాజరుకాలేదు. ఆయన కు బెంగుళూరులోని తమ కార్యాలయంలో శుక్రవారం విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే బెంగుళూరు నిన్న చేరుకున్న సుజనా చౌదరి సీబీఐ ఎదుట హాజరుకాలేదు. తన న్యాయవాదులతో చర్చిస్తూనే ఉండిపోయారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తాను విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు సీబీఐ అధికారులకు సమాచారం పంపారు. అరెస్ట్ భయంతోనే సుజనా చౌదరి విచారణకు హాజరు కాలేదని చెబుతున్నారు. మరోసారి సీీబీఐ సుజనా చౌదరికి నోటీసులు జారీ చేసే అవకాశముంది.
Next Story