Tue Mar 17 2026 21:40:34 GMT+0530 (India Standard Time)
ఎట్టకేలకు ఈడీ ముందుకు సుజనా

సుమారు 6 వేల కోట్ల మేర బ్యాంకులకు రుణాలు ఎగొట్టారనే ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ముఖ్యనేత సుజనాచౌదరి చెన్నైలో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. తనకు ఈడీ జారీ చేసిన సమన్లను రద్దుచేయాలని కోరుతూ సూజనా చౌదరి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినా తోసిపుచ్చడంతో ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఓ మహిళా అధికారి నేతృత్వంలో నలుగురు అధికారుల బృందం ఆయనను విచారిస్తోంది. 126 షెల్ కంపెనీలను ఏర్పాటుచేయడం, ఎటువంటి వ్యాపార లావాదేవీలు జరపకుండానే ఈ కంపెనీల పేరుతో రుణాలు తీసుకోవడం, విదేశాలకు నిధులు మళ్లించడం వంటి అంశాలపై ఈడీ విచారణ జరుపుతోంది.
Next Story

