బ్రేకింగ్ : రాష్ట్రపతి స్పందించారు…. సుజనా కేసులు…?
వైసీపీ ఎంపీ విజయసాయరెడ్డి లేఖపై రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ స్పందించారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆర్థిక నేరాలు, మనీల్యాండరింగ్ పై విచారణ జరపాలని [more]
వైసీపీ ఎంపీ విజయసాయరెడ్డి లేఖపై రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ స్పందించారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆర్థిక నేరాలు, మనీల్యాండరింగ్ పై విచారణ జరపాలని [more]

వైసీపీ ఎంపీ విజయసాయరెడ్డి లేఖపై రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ స్పందించారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆర్థిక నేరాలు, మనీల్యాండరింగ్ పై విచారణ జరపాలని విజయసాయిరెడ్డి రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన రాష్ట్రపతి హోం మంత్రిత్వ శాఖకు పంపారు. రాష్ట్రపతి కార్యాలయం నుంచి లేఖ రీడైరెక్ట్ కావడంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంబంధిత ఈడీ అధికారులకు ఈ ఫిర్యాదును పంపినట్లు తెలుస్తోంది. సుజనా చౌదరి ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయనపై బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన కేసులు ఉన్నాయి. గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా సుజనా చౌదరి ఇళ్లల్లోనూ, కార్యాలయాల్లోనూ సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డి ఫిర్యాదు రాష్ట్రపతి కార్యాలయం నుంచి హోంమంత్రిత్వ శాఖకు చేరడం చర్చనీయాంశంగా మారింది.

