జగన్ కు సుజనా సుద్దులు
ఏపీ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టడం లేదని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. పన్నుల రూపంలో వచ్చిన ప్రజల సొమ్మును మతయాత్రలకు కేటాయించడమేంటని ప్రశ్నించారు. నిద్రపోయేవాడిని [more]
ఏపీ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టడం లేదని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. పన్నుల రూపంలో వచ్చిన ప్రజల సొమ్మును మతయాత్రలకు కేటాయించడమేంటని ప్రశ్నించారు. నిద్రపోయేవాడిని [more]

ఏపీ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టడం లేదని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. పన్నుల రూపంలో వచ్చిన ప్రజల సొమ్మును మతయాత్రలకు కేటాయించడమేంటని ప్రశ్నించారు. నిద్రపోయేవాడిని లేపొచ్చని, నిద్రపోతున్నట్లు నటించేవాడిని లేపలేమని జగన్ ఉద్దేశించి సుజనా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం ఓటు బ్యాంకు కోసమే జగన్ నిర్ణయాలుంటున్నాయన్నారు సుజనా చౌదరి. బద్రీనాధ్ కో, కేదారీనాధ్ కో హిందువులు వెళతామంటే సాయం చేస్తారా? అని ప్రశ్నించారు.
జనం నవ్వుకుంటున్నారు…..
తాను కేంద్ర పెద్దలతో మాట్లాడిన తర్వాతనే దీనిపై స్పందిస్తున్నానని చెప్పారు. రాజకీయాలు, ఎన్నికల ధోరణి నుంచి జగన్ బయటపడాల్సిన అవసరం వచ్చిందన్నారు. జగన్ నిర్ణయాలు చూసి జనం నవ్వు కుంటున్నారన్నారు. ఏపీలో గత ఆరు నెలల్లో ఒక్క ఉద్యోగం ఎవరికైనా వచ్చిందా? అని ప్రశ్నించారు. హడావిడిగా వితండవాదంతో ఇంగ్లీష మీడియం పెట్టడమేంటని ప్రశ్నించారు. తెలుగు మీడియంలోనే విద్యాబోధన జరగాలని చెప్పడం వెనక శాస్త్రీయ కారణాలున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసే ఆలోచనలో కేంద్రం లేదని సుజనా చౌదరి తెలిపారు.