Fri Mar 20 2026 07:27:03 GMT+0530 (India Standard Time)
రాజధాని అంగుళం కూడా కదలదు..హామీ ఇచ్చిన సుజనా
రాజధానిని అమరావతి నుంచి అంగుళం కూడా కదల్చలేరని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. తాను రాజధాని రైతులకు అండగా ఉంటానని చెప్పారు. హైకోర్టులో ఇప్పటికే విజెలెన్స్ [more]
రాజధానిని అమరావతి నుంచి అంగుళం కూడా కదల్చలేరని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. తాను రాజధాని రైతులకు అండగా ఉంటానని చెప్పారు. హైకోర్టులో ఇప్పటికే విజెలెన్స్ [more]

రాజధానిని అమరావతి నుంచి అంగుళం కూడా కదల్చలేరని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. తాను రాజధాని రైతులకు అండగా ఉంటానని చెప్పారు. హైకోర్టులో ఇప్పటికే విజెలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయాలను తరలింపుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పును ఆయన గుర్తు చేశారు. గత మూడు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులకు న్యాయం జరుగుతుందని సుజనా తెలిపారు. బీజేపీ సంపూర్ణ మద్దతు రాజధాని రైతులకు ఉంటుందని చెప్పారు. రాజకీయంగానూ, న్యాయపరంగానూ పోరాటం చేసి అమరావతిని కాపాడుకుందామని సుజనా చౌదరి పిలుపునిచ్చారు.
Next Story