Fri Mar 20 2026 15:12:19 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రద్దుకు నిరసనగా ఆత్మహత్యాయత్నం

ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఓ నిరుద్యోగి ఆత్మహత్యయాత్నం చేసుకున్నాడు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలానికి చెందిన ఈశ్వర్ అనే విద్యార్థి గురువారం రాజ్ భవన్ వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు తేరుకుని ఆయనను అడ్డుకున్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసి కొట్లాడితే నిరుద్యోగులు, విద్యార్థులకు ఏమీ ఒరగలేదని, ఉద్యోగ నియామకాలు చేయలేదని ఈశ్వర్ ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడిన వారికి, అమరవీరులకు కేసీఆర్ ఏమీ చేయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి గా కేసీఆర్ ఏం చేశారని, ఏం సాదించారని అసెంబ్లీని రద్దు చేస్తున్నారని ప్రశ్నించారు.
Next Story

