Sat Mar 21 2026 15:42:35 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : గాంధీ భవన్ ముందు రైతు ఆత్మహత్యాయత్నం

కౌలు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ ముందు ఓ కౌలు రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రాంతానికి చెందిన వెంకటయ్య ఐదెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి పంట వేశారు. వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పులపాలయ్యారు. ప్రభుత్వం తరుపున కూడా ఎటువంటి సహాయం అందలేదు. దీంతో కౌలురైతులకు న్యాయం జరగాలంటూ వెంకలయ్య శుక్రవారం గాంధీ భవన్ ముందు పురుగుల మందు తాగారు. దీంతో వెంటనే కాంగ్రెస్ నేతలు, పోలీసులు ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Next Story

