Fri Dec 05 2025 14:59:26 GMT+0000 (Coordinated Universal Time)
ప్రగతి భవన్, మంత్రి ఈటల ఇంటి ముట్టడికి యత్నం
తెలంగాణలో ఇంటర్ ఫలితాల అవకతవకలపై ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. తమ పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ జిల్లాల నుంచి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు వద్దకు [more]
తెలంగాణలో ఇంటర్ ఫలితాల అవకతవకలపై ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. తమ పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ జిల్లాల నుంచి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు వద్దకు [more]

తెలంగాణలో ఇంటర్ ఫలితాల అవకతవకలపై ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. తమ పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ జిల్లాల నుంచి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు వద్దకు వస్తున్నారు. హైదరాబాద్ లోనే కాకుండా జిల్లాల్లోనూ వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ను ముట్టడించడానికి ఎస్ఎఫ్ఐ నేతలు ప్రయత్నించారు. కరీంనగర్ లో మంత్రి ఈటెల రాజేందర్ ఇంటిని ముట్టడించడానికి విద్యార్థులు ప్రయత్నించారు. వీరిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇక, తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ల మిట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది.
Next Story