Tue Feb 03 2026 02:15:57 GMT+0000 (Coordinated Universal Time)
అభిమానులకు స్టాలిన్ వినతి

తన తండ్రి పార్థివదేహాన్ని కడసారి చూసుకునేందుకు వస్తున్న అభిమానులు, డీఎంకే శ్రేణులు సంయమనం పాటించాలని ఆయన కుమారుడు స్టాలిన్ పిలుపునిచ్చారు. తన తండ్రి అంత్యక్రియల విషయంలో వివాదం సృష్టించాలని చూశారని ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పళనిస్వామి నిర్ణయం ఆశ్చిర్యపరిచిందన్నారు. మెరీనా బీచ్ లో అంత్యక్రియలు జరుపవచ్చని కోర్టు ఇచ్చిన తీర్పు ప్రజా విజయమన్నారు. పోలీసు భద్రత ఎందుకు తగ్గించారో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. అంత్యక్రియలు సజావుగా జరిగిందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Next Story

