Thu Mar 19 2026 21:26:59 GMT+0530 (India Standard Time)
అన్నపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

డీఎంకే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎం.కే.స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ... తాను ఇది వరకు స్టాలిన్ ను కాదని...సరికొత్త స్టాలిన్ ను అని పేర్కొన్నారు. తనకు సోదరి మాత్రమే ఉందని, సోదరుడు లేడని పరోక్షంగా తన అన్న ఆళగిరితో సంబంధం లేదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే పార్టీకి పదవుల కుమ్ములాటలే తప్ప ప్రజల గురించి పట్టదని వ్యాఖ్యనించారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని, దేశప్రజలను మతాల పేరుతో విడగొడుతోందని విమర్శించారు. దేశంలో జరుగుతున్న దారుణాలు అరికట్టాలంటే ప్రధాని పదవి నుంచి మోదీని దింపేయాలని ఆయన పేర్కొన్నారు.
Next Story

