శభాష్ మేడమ్….!!
ప్రజలంతా కరోనా భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు. అధికారులు మాత్రం ప్రజల బాగోగులను చూసుకునేందుకు విధులు నిర్వహిస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ఇలా కరోనా [more]
ప్రజలంతా కరోనా భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు. అధికారులు మాత్రం ప్రజల బాగోగులను చూసుకునేందుకు విధులు నిర్వహిస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ఇలా కరోనా [more]
ప్రజలంతా కరోనా భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు. అధికారులు మాత్రం ప్రజల బాగోగులను చూసుకునేందుకు విధులు నిర్వహిస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ఇలా కరోనా సమయంలో అందిస్తున్న సేవలను దేశం మొత్తం ప్రశంసిస్తుంది. అయితే విశాఖ మున్సిపల్ కమిషనర్ సృజన సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. విశాళ మున్సిపల్ కమిషనర్ సృజన నెల రోజుల క్రితం ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అయినా కరోనా సమయంలో ప్రజలకు సేవ చేసేందుకు సృజన విధుల్లో చేరారు. ఒకవైపు చంటి బిడ్డ ఆలనా, పాలనా, మరోవైపు సేవతో ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారారు. నెటిజెన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తన్నారు. సెలవు తీసుకునే అవకాశం ఉన్నా ఆమె విధుల్లో చేరడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంట్లో ఉన్నా క్యాంప్ ఆఫీస్ గానే భావించి ఆమె సిబ్బందికి సూచనలు చేస్తున్నారు.