Tue Mar 24 2026 06:32:51 GMT+0530 (India Standard Time)
శ్రీనివాసరావు విచారణలో తేలుతుందేమిటి..?

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో సిట్ బృందం ధర్యాప్తు వేగవంతం చేసింది. రేపటితో నిందితుడి కస్టడీ ముగియనున్న నేపథ్యంలో విచారణను కొలిక్కి తెచ్చే దిశగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే శ్రీనివాసరావు తల్లిదండ్రులను విశాఖపట్నం పిలిపించిన పోలీసులు శ్రీనివాసరావు మానసిక పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. ఇక శ్రీనివాసరావు స్నేహితులైన ఇద్దరు యువతులను కూడా ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఘటన గురించి నిందితుడు ముందే వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక నిందితుడి కాల్ లిస్ట్ ప్రకారం విచారణ చేస్తున్న పోలీసులు ఇప్పటికే 40 మందిని విచారించగా అందులో 30 మంది మహిళలే ఉండటం గమనార్హం.
Next Story

