Tue Mar 24 2026 05:03:45 GMT+0530 (India Standard Time)
జగన్ పై దాడికి ముందు స్నేహితురాలికి ఫోన్..?

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యయత్నం చేసిన కేసులో సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది. అన్నికోణాల్లో విచారణ జరపుతున్న పోలీసులు తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నుంచి శ్రీనివాసరావు తల్లిదండ్రులను విశాఖపట్నం తరలిస్తున్నారు. వారిని కూడా పోలీసులు విచారించనున్నారు. నిన్నటివరకు 37 మందిని విచారించిన పోలీసులు ఇవాళ ప్రకాశం జిల్లా కనిగిరికి, గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన నలుగురిని కూడా పోలీసులు విశాఖపట్నం తీసుకువచ్చి ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాసరావు దాడి ఘటనకు 10 నిమిషాల ముందు కనిగిరికి చెందిన ఓ మహిళకు ఫోన్ చేసి జగన్ పై దాడి చేస్తున్నట్లు చెప్పారు. అయితే, ఆ మహిళ ఒక రాంగ్ కాల్ ద్వారా శ్రీనివాసరావుకు పరిచయం అయినట్లు తెలుస్తోంది. ఇక జగన్ స్టేట్ మెంట్ తీసుకోవడానికి పోలీసులు కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది
Next Story

