Wed Jan 28 2026 17:42:25 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ వల్లే ఈ రోజు బతికున్నా..!
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై దాడికి పాల్పడ్డ జనిపల్లి శ్రీనివాసరావును బెయిల్ పై విడుదలయ్యాడు. అనారోగ్య కారణాలను చూపి ఏడు నెలల తర్వాత అతడు [more]
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై దాడికి పాల్పడ్డ జనిపల్లి శ్రీనివాసరావును బెయిల్ పై విడుదలయ్యాడు. అనారోగ్య కారణాలను చూపి ఏడు నెలల తర్వాత అతడు [more]

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై దాడికి పాల్పడ్డ జనిపల్లి శ్రీనివాసరావును బెయిల్ పై విడుదలయ్యాడు. అనారోగ్య కారణాలను చూపి ఏడు నెలల తర్వాత అతడు బెయిల్ పొందాడు. రాజమండ్రి జైల్ నుంచి శనివారం ఉదయం విడుదలయ్యాడు. జైలు బయట అతడు మీడియాతో మాట్లాడుతూ… తాను జగన్ ను కలవాలన్న ఉత్సాహంలో అనుకోకుండా తన వద్ద ఉన్న కత్తి ఆయనకు గుచ్చుకుందని, తాను కావాలని జగన్ పై దాడి చేయలేదని కొత్త వాదన వినిపించాడు. ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను జగన్ దృష్టికి తీసుకువచ్చేందుకే లేఖ రాసి జగన్ కు ఇవ్వాలనుకున్నానని అన్నాడు. ఆ ఘటన తర్వాత అంతా తనను కొడుతుంటే జగనే ఆపారని, ఆయన వల్లే తాను బతికి ఉన్నానని అన్నాడు.
Next Story