Thu Jun 30 2022 17:27:41 GMT+0000 (Coordinated Universal Time)
ఉద్యోగ నేత నుంచి మంత్రిగా

ఉద్యోగిగా ప్రస్తానాన్ని ప్రారంభించిన శ్రీనివాస్ గౌడ్ కు మంత్రి పదవి దక్కింది. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం కొనసాగిన ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులకు నాయకత్వం వహించారు. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి ఆయన ఉద్యోగంలో చురుగ్గా పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీవిరమణ చేసిన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన మహబూబ్ నగర్ అసెంబ్లీ నుంచి విజయం సాధించారు. ఇటీవలి ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించిన ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు కేసీఆర్ మొగ్గు చూపారు. పురపాలక శాఖలో పనిచేసిన అనుభవం ఉన్న ఆయనకు పురపాలక శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
Next Story