Fri Mar 20 2026 21:12:49 GMT+0530 (India Standard Time)
టవర్ ఎక్కిన టీఆర్ఎస్ కార్యకర్తలు

సంచలనానికి తెరతీస్తూ 105 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించడంతో టీఆర్ఎస్ లో లుకలుకలు రచ్చకెక్కుతున్నాయి. మలిదశ తెలంగాణ ఉద్యమం తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టిక్కెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఇద్దరు యువకులు ఎల్బీనగర్ లో ఆందోళనకు దిగారు. వారు చింతలకుంటలోని రేడియో టవర్ ఎక్కి నిరసనకు దిగారు. శంకరమ్మకు టిక్కెట్ ప్రకటించే వరకు కిందకు దిగేది లేదని అంటున్నారు. దీంతో ఎల్బీనగర్ లో ఉదృక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story

