Sat Mar 21 2026 12:26:45 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : హైదరాబాద్ లో మరో మారుతీరావు

మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య ఘటనను ఇంకా మరవకముందే హైదరాబాద్ లో మరో సంఘటన జరిగింది. బోరబండకు చెందిన మాదవి, ఎర్రగడ్డకు చెందిన సందీప్ లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి ప్రేమ అమ్మాయి ఇంట్లో ఇష్టం లేకపోవడంతో ఇటీవల వీరు రిజిస్ట్రార్ మ్యారేజ్ చేసుకుని ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో రగిలిపోతున్న అమ్మాయి మేనమామ మాట్లాడుకుందామని... అమ్మాయి, అబ్బాయి ఇద్దరినీ బోరబండకు పిలిచారు. బైక్ పై వచ్చిన అమ్మాయి మేనమామ బోరబండ చౌరస్తాలోనే వేటకొడవలితో ఇద్దరిపై విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయాడు. తీవ్రగాయాలపాలై రోడ్డుపై కొట్టుమిట్టాడుతున్న ఇద్దరిని స్థానికులు నీలిమ ఆసుపత్రికి తరలించారు. మాధవి పరిస్థితి తీవ్ర విషమంగా ఉండగా, అబ్బాయికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
Next Story

