Tue Feb 03 2026 01:56:42 GMT+0000 (Coordinated Universal Time)
లెక్కకు మించి కేసులు.. ఈరోజు నుంచి మరింతగా?
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజే కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. ఇందులో 152 కేసులు హైదరాబాద్ [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజే కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. ఇందులో 152 కేసులు హైదరాబాద్ [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజే కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. ఇందులో 152 కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చిన తర్వాత తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది. మొత్తంగా నమోదయిన కేసుల్లో ఎక్కువ హైదరాబాద్ లోనే ఉంటున్నాయి. నేటి నుంచి బార్లు, హోటల్స్ కూడా ప్రారంభం కానున్నాయి. దీంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,496కు చేరుకుంది. మరణించిన వారి సంఖ్య 123కు చేరుకుంది. ప్రజలు తమంతట తాముగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది.
Next Story

