Wed Mar 18 2026 02:14:08 GMT+0530 (India Standard Time)
భారత్ లో భారీగా పెరిగిన కేసులు.. 20 లక్షలు దాటి
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ ఒక్కరోజే 62,498 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 886 మంది 24 గంటల్లో కరోనాతో మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ ఒక్కరోజే 62,498 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 886 మంది 24 గంటల్లో కరోనాతో మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ ఒక్కరోజే 62,498 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 886 మంది 24 గంటల్లో కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,27,034కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా భారత్ లో 41,585 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 6.7 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 13.78 లక్షలుగా ఉంది. ఒక్కరోజులో ఇన్ని కేసులు బయటపడటం ఇదే తొలిసారి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story