Tue Feb 03 2026 02:17:36 GMT+0000 (Coordinated Universal Time)
స్టాలిన్ కు భావోద్వేగంతో సోనియా లేఖ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతికి యూపీఏ అధినేత్రి సోనియా గాంధి సంతాపం తెలిపారు. ఆ మేరకు ఆమె కరుణ కుమారుడు స్టాలిన్ కు తీవ్ర భావోద్వేగంతో లేఖ రాశారు. ‘‘కరుణ తనకు తండ్రి లాంటి వారు, ఆయన మృతి తీరని లోటు. కరుణానిధి లాంటి నాయకుడిని మళ్లీ మనం చూడలేం. నిరుపేదల కోసం జీవితం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ఆయన. నా పట్ల ఆయన ఎంతో అభిమానం చూపించేవారు. అది మరిచిపోలేను. వ్యక్తిగతంగా కూడా కరుణ మరణం నాకు తీరని లోటు’’ అని ఆమె స్టాలిన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. కరుణానిధి పార్థివదేహానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్ తదితరులు నివాళులు అర్పించారు.
Next Story

