Wed Mar 18 2026 18:13:29 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో సోనియా గాంధీ

తెలంగాణ రాష్ట్రంలోకి యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ మొదటిసారి అడుగుపెట్టారు. మేడ్చెల్ లో కాంగ్రెస్ పార్టీ సభకు హాజరయ్యేందుకు ఆమె వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ముఖ్యనేతలు ఆమెకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆమె మేడ్చల్ కి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరింది. ఇక రాహుల్ గాంధీ రావాల్సిన విమానం ఆలస్యం కావడంతో ఆయన 40 నిమిషాలు ఆలస్యంగా బేగంపేటకు రానున్నారు. 40 నిమిషాల పాటు సోనియా గాంధీ సభలో ప్రసంగించనున్నారు.
Next Story

