Sun Feb 01 2026 19:56:48 GMT+0000 (Coordinated Universal Time)
సోనియా గాంధీ లెక్కల్లో వీక్

కేంద్రప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం గెలవడానికి సరిపడా సంఖ్యబలం ఉందని, అన్ని పార్టీలను కలుపుకుని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అనంత్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పాపం సోనియా గాంధీ లెక్కల్లో వీక్ అనుకుంటా, వారి పార్టీకి ఉన్న ఎంపీల సంఖ్య ఎంతో చూసుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుతం లోక్సభలో తమ కూటమికి 313 మంది ఎంపీల మద్దతు ఉందని, శివసేన కూడా ఎన్డీఏలోనే ఉందని, కచ్చితంగా తమవైపే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అవిశ్వాసం వీగిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Next Story

