Mon Mar 23 2026 00:56:40 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు డైరక్షన్ లోనే...!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై అలిపిరిలో జరిగిన దాడి పూర్తిగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే జరిగిందని బీజేపీ నేత సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ...అమిత్ షాపైన జరిగిన దాడిని ఖండించారు. చంద్రబాబు బయట చెప్పేది ఒకటని, లోపల చేసేది మరోటని విమర్శించారు. షా పై దాడికి ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దాడి ఘటనకు పాల్పడ్డవారిపై కేసులు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. మరోవైపు ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలను అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ అర్థరాత్రి ఆందోళనకు దిగారు. పోలీసు ఉన్నతాధికారులు సర్ధిచెప్పడంతో ఆమె ఆందోళన విరమించారు.
Next Story

