Sat Jan 31 2026 05:08:09 GMT+0000 (Coordinated Universal Time)
బేరం కుదరనందుకే ఆలస్యం

తెలుగుదేశం పార్టీది ధర్మ పోరాట దీక్ష కాదని, ధర్మ పోరాట దీక్ష భారతీయ జనతా పార్టీ చేస్తోందని, పరిపాలన వికేంద్రీకరించాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని తాము పోరాడుతున్నామని బీజేపీ నేత సోము వీర్రాజు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...రాయలసీమకు నీళ్లిచ్చేందుకు హంద్రీనీవా పనులు ఎందుకు పూర్తి చేయడం ప్రశ్నించారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు 2016 వరకు పోలవరం ప్రాజెక్టు ప్రారంభించక పోవడానికి కారణం చంద్రబాబుకు బేరం కుదరనందునే అని ఆరోపించారు. 1998 నుంచి చంద్రబాబును గమనిస్తున్నామని, పరిపాలన వికేంద్రీకరించాలని తాము కోరుతున్నామని, కేవలం అమరావతి అభివృద్ధి చెందితే సరిపోదని, ఉత్తరాంధ్ర, రాయలసీమ కనపడటం లేదా అని ప్రశ్నించారు.
Next Story

