Fri Dec 26 2025 23:55:23 GMT+0000 (Coordinated Universal Time)
మాకు ఫుల్లు క్లారిటీ ఉంది
పోలవరం పై తాము పూర్తి క్లారిటీతో ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. రాజధాని [more]
పోలవరం పై తాము పూర్తి క్లారిటీతో ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. రాజధాని [more]

పోలవరం పై తాము పూర్తి క్లారిటీతో ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. రాజధాని అమరావతిపై కూడా తమకు స్పష్టమైన అభిప్రాయం ఉందన్నారు. అమరావతిని అభివృద్ధి చేయాలన్నదే తమ నినాదమన్నారు. అమరావతిలో తమ పార్టీ కార్యాలయం కూడా నిర్మిస్తామని సోము వీర్రాజు చెప్పారు. తాము వైసీపీ, టీడీపీలకు సమాన దూరం పాటిస్తామని సోము వీర్రాజు చెప్పారు. వైసీపీ నేతల అవినీతిపై తమ పార్టీ కార్యకర్తల చేత సర్వే చేయిస్తామని కూడా ఆయన చెప్పారు.
Next Story