Tue Mar 10 2026 09:04:24 GMT+0530 (India Standard Time)
దుర్గగుడి రథంలో మూడు సింహాలు మాయమయ్యాయ్
విజయవాడ దుర్గగుడికి చెందిన రధంలో మూడు వెండి సింహాలు మాయమయ్యాయని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. రధాన్ని గత ఉగాది నుంచి బయటకు తీయలేదని, ఎవరో [more]
విజయవాడ దుర్గగుడికి చెందిన రధంలో మూడు వెండి సింహాలు మాయమయ్యాయని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. రధాన్ని గత ఉగాది నుంచి బయటకు తీయలేదని, ఎవరో [more]

విజయవాడ దుర్గగుడికి చెందిన రధంలో మూడు వెండి సింహాలు మాయమయ్యాయని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. రధాన్ని గత ఉగాది నుంచి బయటకు తీయలేదని, ఎవరో కావాలని చేసిన పనిలాగా అనిపిస్తుందని ఆయన వ్యాఖ్యనించారు. దుర్గగుడి వెండి రధంకు నాలుగు సింహాల బొమ్మలుంటాయి. అందులో ప్రస్తుతం ఒక్కటి మాత్రమే ఉందని సోము వీర్రాజు చెప్పారు. దీనిపై విచారణ జరిపించాలని కోరారు. కాగా ఈవో సురేష్ బాబు మాత్రం సింహాలు మాయం కాలేదని చెబుతున్నారు. రికార్డులు పరిశీలించిన తర్వాత చెబుతామని ఆయన అన్నారు.
Next Story