Mon Mar 23 2026 16:24:57 GMT+0530 (India Standard Time)
చంద్రబాబుపై సోము శివాలెత్తారే

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫైరయ్యారు. ప్రజల వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి తనను రక్షించాల్సిందిగా కోరుతున్నారని, దేశంలో ఎక్కడా ఇటువంటి సంఘటనలు చూడలేదని ఎద్దేవా చేశారు. ప్రజలను రక్షించాల్సిన ముఖ్యమంత్రే తనను రక్షించాలని కోరడం ఏంటని ప్రశ్నించారు. నిన్న మొన్నటి దాకా గవర్నర్ నుటీడీపీ నేతలు ప్రశంసించారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కుని, వారి చేత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించిప్పుడు గవర్నర్ మంచివారని టీడీపీ నేతలు పొగిడిన విషయాన్ని ఈ సందర్భంగా వీర్రాజు గుర్తు చేశారు. ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ను ఎందుకు టీడీపీ టార్గెట్ చేయాల్సి వస్తుందో ప్రజలకు వివరించాలని సోము డిమాండ్ చేశారు. నరసింహన్ విషయంలో చంద్రబాబు యూటర్న్ ఎందుకు తీసుకున్నారో చెప్పాలన్నారు.
Next Story

