Sat Dec 06 2025 22:34:25 GMT+0000 (Coordinated Universal Time)
పోలీస్ స్టేషన్ కు సోమిరెడ్డి
గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఆయనపై వెంకటచాలం పోలీస్ [more]
గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఆయనపై వెంకటచాలం పోలీస్ [more]

గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఆయనపై వెంకటచాలం పోలీస్ స్టేషన్ పరిధిలో భూకబ్జా కేసు నమోదయింది. ఒక భూవివాదంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాత్ర ఉందని కోర్టు సూచనలతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణకు హాజరుకావాల్సిందిగా పోలీసులు పది రోజుల క్రితం నోటీసులు అంద జేశారు. చివరకు ఈరోజు వెంకటాచలం పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఆయనను గంట సేపటినుంచి పోలీసులు భూ వివాదంపై విచారణ చేస్తున్నారు.
Next Story