Sat Mar 21 2026 22:16:27 GMT+0530 (India Standard Time)
సోమిరెడ్డి శాపనార్థాలు

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. రమణదీక్షితుల వంటి వారి వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. రమణ దీక్షితులను జైల్లో పెట్టి నాలుగు తగిలిస్తే నిజాలు బయటకు వస్తాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంకటేశ్వరస్వామితోనే ఆడుకుంటారా?అని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ, బీజేపీ కలిసి రమణ దీక్షితులతో డ్రామా ఆడిస్తున్నాయన్నారు. వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే నాశనమై పోతారని శాపనార్థాలు పెట్టారు సోమిరెడ్డి.
Next Story

