Thu Mar 19 2026 01:44:05 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : సోమనాథ్ ఛటర్జీ ఇకలేరు

మాజీ లోక్ సభ స్పీకర్ సోమనాధ్ ఛటర్జీ కన్నుమూశారు. కోల్ కత్తా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్నారు.1968లో సీపీఎంలో సోమనాథ్ ఛటర్జీ చేరారు. 89 సంవత్సరాల వయస్సున్న సోమనాథ్ ఛటర్జీ 2004 నుంచి 2009 వరకూ లోక్ సభ స్పీకర్ గా పనిచేశారు. సోమనాథ్ ఛటర్జీ మరణం తీరని లోటని వామపక్ష పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఆయన తీసుకున్న నిర్ణయాలు అనేకం ఇప్పటికీ అందరూ అనుసరించాల్సినవని పలువురు అభిప్రాయపడ్డారు.
Next Story

