Thu Mar 19 2026 03:04:35 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైఎస్ జగన్ కు సిట్ నోటీసులు

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో సిట్ విచారణ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జగన్ కి మరోసారి నోటీసులు జారీ చేసింది. ఘటనపై జగన్ వాంగ్మూలం కోసం సిట్ నోటీసులు ఇచ్చింది. ఇంతకుముందు కూడా జగన్ స్టేట్ మెంటు రికార్డు చేయడానికి సిట్ ప్రయత్నించినా జగన్ ఇవ్వలేదు. ఘటన జరిగిన గంటలోనే పబ్లిసిటీ కోసం జరిగిందని స్వయంగా డీజీపీ చెప్పాక తమకు రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో విచారణపై నమ్మకం లేదని జగన్ పోలీసులకు చెప్పి పంపిన విషయం తెలిసిందే.
Next Story

