Mon Mar 23 2026 06:05:00 GMT+0530 (India Standard Time)
భారత్ పై శ్రీలంక అధ్యక్షుడి సంచలన ఆరోపణలు

భారత్ పై శ్రీలంక దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంచలన ఆరోపణలు చేశు. భారత్ కు చెందిన గూఢచార సంస్థ రీసెర్చ ఆండ్ అనాలసిస్ వింగ్(రా) తనను చంపేందుకు కుట్ర పన్నుతోందని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. కానీ, రా కుట్ర భారత ప్రధాని నరేంద్ర మోదీకి తెలియదని ఆయన పేర్కొన్నారు. శ్రీలంక క్యాబినెట్ సమావేశంలో ఆయన ఈ ఆరోపణలు చేశారని తెలుస్తోంది, కానీ అధికారిక ద్రువీకరణ మాత్రం ఇంకా రాలేదు. కాగా, మరికొన్ని రోజుల్లో ఆయన భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. రా పై శ్రీలంక రాజకీయ నేతల ఆరోపణలు కొత్తేమీ కాదు. గతంలోనూ ఆ దేశ ప్రధాని ఇటువంటి ఆరోపణలే చేశారు.
Next Story

