Wed Mar 18 2026 04:28:36 GMT+0530 (India Standard Time)
సిద్ధూ మెడకు మరో వివాదం

మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కర్తార్ పూర్ కారిడార్ శంకుస్థాపనకు పాకిస్థాన్ వెళ్లిన సిద్ధూ అక్కడి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పొగడ్తలతో ముంచెత్తారు. ఇక ఇప్పుడు బయటకు వచ్చిన ఓ ఫోటో సిద్ధూను వివాదంలోకి నెట్టింది. ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాది, పాకిస్థాన్ సిక్కు గోపాల్ సింగ్ చావ్లాతో కలిసి ఫోటో దిగాడు. ఈ ఫోటోను చావ్లానే తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీంతో సిద్ధూ వ్యవహారశైలిటి తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఒక ఉగ్రవాదిని శత్రుదేశంలో కలిసి ఫోటోలో దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి కూడా సిద్ధూ వెళ్లి పాకిస్థాన్ ను, ఇమ్రాన్ ను పొడిగి వచ్చిన విషయం తెలిసిందే.
Next Story

