Fri Jan 30 2026 18:23:56 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం నియోజకవర్గంలో తీవ్ర విషాదం..!

సిద్ధిపేట జిల్లాలో రాజీవ్ రహదారిపై శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గజ్వేల్ మండలం రిమ్మనగూడెం సమీపంలో ఒకేపారి నాలుగు వాహనాలు ఢికొని 10 మంది మృతిచెందారు. మరో 20 మంది వరకు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును, వెనక నుంచి రెండు లారీలు, క్వాలీస్ వాహనం ఢీకొట్టాయి. దీంతో బస్సు బోల్తా పడింది. అధికారులు వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం గజ్వేల్, హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించారు. అయితే మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నపిల్లలతో పాటు ఓ జర్నలిస్టు కూడా ఉన్నారు.ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Next Story

