Sat Mar 21 2026 15:49:37 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసులు

తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీల నియామకంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తాను చేసిన వ్యాఖ్యలపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేకపోతే పార్టీ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై శుక్రవారం గాంధీ భవన్ లో సమావేశమైన క్రమశిక్షణ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. కమిటీల్లో కష్టపడే వారికి కాకుండా బ్రోకర్లకు పదవులు ఇచ్చారని, కుంతియా తెలంగాణ కాంగ్రెస్ కు శనిలా దాపురించాడని రాజగోపాల్ రెడ్డి నిన్న కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Next Story

