Wed Mar 25 2026 01:44:23 GMT+0530 (India Standard Time)
చిత్తూరు జిల్లాలో టీడీపీకి షాక్

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో కీలకంగా పనిచేసిన కొండా కుటుంబం ఆ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో కొండా సిద్దార్థ, కొండా గీతమ్మ, వారి అనుచరులు విజయనగరం జిల్లాలో పార్టీ అధినేత వై.ఎస్. జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. గీతమ్మ ప్రస్తుతం పిటిఎం మండల ఎంపీపీగా పనిచేస్తున్నారు. కొండా కుటుంబం రాకతో తంబళ్లపల్లి నియోజకవర్గంలో వైసీపీ మరింత బలోపేతం అయ్యిందని మిథున్ రెడ్డి పేర్కొన్నారు.
Next Story

