Sun Mar 22 2026 08:50:14 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ కు గజ్వేల్ లోనే షాక్..!

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వంత నియోజకవర్గం గజ్వేల్ లోనే చిన్న ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన జగదేవ్ పూర్ ఎంపీపీ, ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు కౌనిసలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగదేవ్ పూర్... కేసీఆర్ ఫామ్ హౌజ్ ఉన్న మండలం కావడం గమనార్హం. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి భారీగా ఓట్లు సాధించిన వంటేరు ప్రతాప్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నికల్లోనూ ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు గట్టి పోటీనే ఇచ్చే అవకాశం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి.
Next Story

