Mon Mar 23 2026 16:58:48 GMT+0530 (India Standard Time)
జగన్ ఘటనపై శివాజీ జోస్యం

చంద్రబాబు ప్రభుత్వానని కూలదోసే కుట్ర జరుగుతుందని, మూడు నెలల్లో ప్రభుత్వాన్ని కూలదోస్తారని సినీ నటుడు శివాజి జోస్యం చేప్పారు. జగన్ పై హత్యాయత్న నేపథ్యంలో ఆయన స్పందించారు. రాష్ట్రమంతా ఆపరేషన్ గరుడ గురించి చర్చించుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంపై కుట్రలు జరిగినా, తప్పులు జరిగినా బయటపెడతానని పేర్కొన్నారు. రాష్ట్రంపై ఏదో రకంగా కుట్ర చేయాలని చూస్తున్నారని, రాష్ట్రంపై కుట్రలో వ్యవస్థలను వాడుకోవడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబుది దాడులు చేయించే మనస్తత్వమే అయితే ఇంతవరకు రాదని, చంద్రబాబు ఎలాంటి వారో ఏపీకే కాదు... దేశం మొత్తం తెలుసని పేర్కొన్నారు. జీవీఎల్ కు, ఏపీకి ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. జీవీఎల్ ఏపీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడన్నారు. ఇవాళటి ఘటన గురించి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.
Next Story

