Sat Jan 31 2026 14:41:52 GMT+0000 (Coordinated Universal Time)
హీరో శివాజీపై దాడికి యత్నం

గత కొన్ని రోజులుగా బీజేపీపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తున్న హీరో శివాజిపై దాడికి పలువురు యత్నించారు. హైదరాబాద్ వెళ్లేందుకు బుధవారం సాయంత్రం శివాజీ గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఇదే సందర్భంలో విజయవాడకు వస్తున్న బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు స్వాగతం పలికేందుకు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎయర్ పోర్టుకు వచ్చారు. దీంతో శివాజికి, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగి, శివాజీపై దాడికి బీజేపీ కార్యకర్తలు యత్నించారు. పోలీసులు రంగప్రవేశం చేసి బీజేపీ కార్యకర్తలను నిలువరించారు. కాగా, దాడులకు తాను భయపడేది లేదని శివాజి పేర్కొన్నారు.
Next Story

