Wed Mar 18 2026 22:50:13 GMT+0530 (India Standard Time)
శివాజీకి ఇంత భద్రతేంటి బాబూ...??

‘ఆపరేషన్ గరుడ’ను తెరపైకి తెచ్చిన నటుడు శివాజీ అమెరికా నుంచి హైదరాబాద్ కి చేరుకున్నారు. ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై దాడి జరుగుతుందని శివాజీ ముందే చెప్పిన విషయం తెలిసిందే. అయతే, దాడి తర్వాత రాష్ట్రంలో అల్లర్లు జరుగుతాయని ఆయన చెప్పగా అటువంటి అల్లర్లేమీ జరగలేదు. జగన్ పై హత్యాయత్నం ఘటనకు ముందే ఆయన అమెరికా వెళ్లారు. అయితే, దాడి విషయంలో ముందే తెలిసిన శివాజీని విచారించి నిజాలు రాబట్టాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, భద్రత పెంచాలని శివాజీ ఏపీ హోంమంత్రి, డీజీపీకి లేఖ రాశారు. దీంతో ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ చేరుకున్న శివాజీకి భద్రత ఏర్పాటుచేసింది.
Next Story

