Sat Mar 28 2026 04:59:27 GMT+0530 (India Standard Time)
మరికాసేపట్లో నడిరోడ్డుపై “మహా” పరేడ్
మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమి మరో వ్యూహాన్ని ఎంచుకుంది. ఈరోజు రాత్రి 7గంటలకు ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్ వద్ద ఎమ్మెల్యేలతో [more]
మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమి మరో వ్యూహాన్ని ఎంచుకుంది. ఈరోజు రాత్రి 7గంటలకు ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్ వద్ద ఎమ్మెల్యేలతో [more]

మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమి మరో వ్యూహాన్ని ఎంచుకుంది. ఈరోజు రాత్రి 7గంటలకు ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్ వద్ద ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించనుంది. మూడు పార్టీల ఎమ్మెల్యేలు 162 మందితో నడిరోడ్డుపై పరేడ్ నిర్వహించాలని నిర్ణయించింది. రేపు సుప్రీంకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలసి ఈ ప్రదర్శన నిర్వహించనున్నాయి. తమకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని జాతీయ స్థాయిలో తెలిపేందుకు ఈ ప్రదర్వన నిర్వహించనున్నాయి. ఈ బలప్రదర్శనతోనైనా గవర్నర్ దిగి వస్తారని అంచనాలో ఉన్నాయి.
Next Story