Thu Mar 19 2026 04:08:47 GMT+0530 (India Standard Time)
నీకు ఆదివారం మాత్రమే భార్య

టీమిండియా దాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు జోరావర్ అని ఓ కుమారుడు ఉన్నాడు. తన అల్లరితో టీం ఇండియాకి మొత్తం ఎంతో ఇష్టంగా మారాడు. అయితే, తాజాగా జోరావర్ మాట్లాడిన మాటలు భువనేశ్వర్ ను కడుపుబ్బా నవ్వించాయట. భువనేశ్వర్ తో పాటు ఆయన సతీమణి నుపుర్ లు జోరావర్ ను ఎంతగానో ఇష్టపడతారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల నుపుర్ తో జోరావర్ ఆడుకుంటుండగా భువనేశ్వర్ వచ్చాడు. అతడిని ఆటపట్టించేందుకు ఆమె నా భార్య అని భువి గట్టిగా అరిచాడు. దీంతో కొద్దిగా కూడా భయపడని జోరావర్.. ఆమె నా భార్య.. ఆదివారం మాత్రమే నీకు భార్య అని అరిచాడట. దీంతో భువనేశ్వర్ దంపతులు కడుపుబ్బా నవ్వుకున్నారు. ఈ విషయాన్ని భువనేశ్వర్ స్వయంగా చెప్పాడు.
Next Story

