Sun Mar 22 2026 07:20:25 GMT+0530 (India Standard Time)
ఆ ఒక్క బౌలర్ కి మాత్రమే భయపడ్డాను

డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లో అడుగుపెడుతుంటే ప్రత్యర్థి టీం బౌలర్ల భయం మొదలయ్యేది. మొదటి బంతి నుంచే సునాయసంగా బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లను నైతికంగా దెబ్బకొట్టడం సెహ్వాగ్ నైజం. స్పిన్ అయినా, స్పీడ్ అయినా సెహ్వాగ్ దూకుడు ముందు బౌలర్లు చిన్నబోయేవారు. అఫ్రిదీ వంటి బౌలర్లు తాము సెహ్వాగ్ కు బౌలింగ్ చేయాలంటే భయపడ్డామని చెప్పారు. అటువంటి వీరేంద్రుడు తన కెరీర్ లో ఓ బౌలర్ కు భయపడ్డాడట. అతడు వేసే బౌన్సర్లకు ఇంకా భయపడేవాడట. ఆ బౌలర్ ఎవరో కాదు... రావాల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరుగాంచిన పాకిస్తాన్ ఫేస్ బౌలర్ షోయబ్ అక్తర్. షోయబ్ వేసే బంతులను ఊహించలేమని, ఒక్కో బంతిని ఒక్కోలా వేస్తాడని సెహ్వాగ్ చెప్పాడు. ఆయన ఓ లైవ్ ఛాట్ లో ఈ విషయాన్ని చెప్పారు.
Next Story

