Fri Mar 27 2026 19:24:31 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : షబ్బీర్ హోదా రద్దు

శాసనమండలిలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత హోదా రద్దు చేస్తూ గెజిట్ జారీ అయింది. శాసనమండలిలో నిన్నటి వరకూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ ఆలి ప్రతిపక్షనేతగా వ్యవహరించేవారు. అయితే నిన్న నలుగురు కాంగ్రెస్ మండలి సభ్యులు తాము సీఎల్పీ మీటింగ్ పెట్టుకున్నామని, మండలిలో పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా మండలి కార్యదర్శి కాంగ్రెస్ సభాపక్షాన్ని విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా షబ్బీర్ ఆలీ ప్రతిపక్షనేత హోదాను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.
Next Story

