మోడీ ఆ కలను నెరవేర్చారు

రామాయణం హిందూ పురాణాల్లో విశిష్టమైంది. అది యదార్ధ గాథే అని నమ్ముతారు హిందూ మతవాదులు. రామాయణంలో శ్రీరాముడు జన్మించిన అయోధ్య భారత దేశంలోని యూపీలో ఉంటే సీతాదేవి జన్మించిన జనక్ పూర్ నేపాల్ లో వుంది. ఈ రెండు పవిత్ర ప్రాంతాలను కలుపుతూ బస్సు సర్వీస్ ను ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ప్రారంభించారు. పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందనున్న ఈ కార్యక్రమానికి ఎప్పటినుంచో చిరకాలంగా డిమాండ్ వుంది. తాజాగా మోడీ ఆ కలను సాకారం చేశారు.
రామ్ జానకి మార్గ్ కి కొత్త కళ.....
హిందువుల పవిత్ర ప్రదేశాలను కలుపుతూ సాగే ఈ యాత్ర మార్గాన్ని రామ్ జానకి మార్గ్ గా పిలుస్తారు. ఈ చారిత్రక ఘట్టంతో భారత్ నేపాల్ ఒక్కటేనని చాటామని ప్రధాని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. మొత్తం 520 కిలోమీటర్ల రామ్ జానకి మార్గ్ ఉంటుంది. ప్రతి శుక్రవారం జనక్ పూర్ లో బయల్దేరి శనివారం అయోధ్య చేరుకుంటుంది బస్సు. అయోధ్యను మాత్రమే దర్శించుకునే భక్తులకు ఇప్పుడు సీతాదేవి జన్మించిన ప్రాంతం దర్శించుకునే అవకాశం ఈ సర్వీస్ తో లభించింది. దాంతో తాజా బస్ సర్వీస్ పై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
