Tue Mar 24 2026 16:45:53 GMT+0530 (India Standard Time)
బెజవాడలో మరో ఫ్లెక్సీ....?

పచ్చ తమ్ముళ్ల పిచ్చి పురాణం-టీడీపీకి ఓటమి భయం-టీడీపీని ఓడించే జనసైనికులం ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు బెజవాడలో హాట్ టాపిక్ అయ్యాయి. నిన్న తెలుగుదేశం పార్టీ నేత కాట్రగడ్డ బాబు జనసేనాని పవన్ కల్యాణ్ కు వైఖరిని నిరసిస్తూ పెద్దయెత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి పోటీగా జనసేన కార్యకర్తలు కాట్రగడ్డ బాబు తీరును వ్యతిరేకిస్తూ పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో బెజవాడలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య ఫ్లెక్సీల యుద్ధం ప్రారంభమయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు పార్టీల నేతలను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు.
Next Story

