Mon Mar 16 2026 00:33:24 GMT+0530 (India Standard Time)
ఎన్నికలను వాయిదా వేయండి.. కుదరదన్న కోర్టు
తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీ పిటీషన్ వేశారు. కరోనా తీవ్రత ఎక్కవగా ఉన్నందున ఈ ఎన్నికలను వాయిదా [more]
తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీ పిటీషన్ వేశారు. కరోనా తీవ్రత ఎక్కవగా ఉన్నందున ఈ ఎన్నికలను వాయిదా [more]

తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీ పిటీషన్ వేశారు. కరోనా తీవ్రత ఎక్కవగా ఉన్నందున ఈ ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటు తెలంగాణలోని మరికొన్ని మున్సిపాలిటీలకు ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అయితే కరోెనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎన్నికలను వాయిదా వేయాలంటూ షబ్బీర్ ఆలీ పిటీషన్ వేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున దీనిని వాయిదా వేయలేమని చెప్పింది. తదుపరి విచారణను జూన్ 7వ తేదీకి వాయిదా వేసింది.
Next Story