Sun Mar 22 2026 20:17:01 GMT+0530 (India Standard Time)
బిగ్ బ్రేకింగ్ : బీజేపీలోకి కాంగ్రెస్ ముఖ్యనేత భార్య

తెలంగాణలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నేతలు పార్టీల్లో చేరికలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ భార్య పద్మినీరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం ఆసక్తికరంగా మారింది. ఆమె ఇవాళ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ముఖ్య నేత మురళీధర్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు. అయితే, ఆమె చేరికను ఆహ్వానిస్తూ మురళీధర్ రావు, లక్ష్మణ్ మీడియాతో మాట్లాడినా... వారి పక్కనే పద్మినీరెడ్డి కూర్చున్నా ఆమె మాత్రం మీడియాతో మాట్లాడలేదు.
Next Story

