Mon Feb 02 2026 20:19:15 GMT+0000 (Coordinated Universal Time)
విలపించిన అద్వానీ
బీజేపీ సీనియర్ నేత అద్వానీ కన్నీరు మున్నీరయ్యారు. సుష్మాస్వరాజ్ భౌతిక కాయాన్ని చూసి అద్వానీ కంటతడి పెట్టారు. తనకు సుష్మా స్వరాజ్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు [more]
బీజేపీ సీనియర్ నేత అద్వానీ కన్నీరు మున్నీరయ్యారు. సుష్మాస్వరాజ్ భౌతిక కాయాన్ని చూసి అద్వానీ కంటతడి పెట్టారు. తనకు సుష్మా స్వరాజ్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు [more]

బీజేపీ సీనియర్ నేత అద్వానీ కన్నీరు మున్నీరయ్యారు. సుష్మాస్వరాజ్ భౌతిక కాయాన్ని చూసి అద్వానీ కంటతడి పెట్టారు. తనకు సుష్మా స్వరాజ్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన ప్రతి పుట్టినరోజుకు సుష్మా స్వరాజ్ తెచ్చే తనకు ఇష్టమైన చాక్లెట్ కేక్ కోసం ఎదురు చూసేవాడినని అద్వానీ విలపించారు. సుష్మా స్వరాజ్ స్వయం కృషితో బీజేపీలో ఎదిగారన్నారు. ఆమె మంచి వక్త అని, ప్రతి విషయాన్ని గుర్తుంచుకుని,అవసరమైనప్పుడు వాటిని ప్రస్తావించడం సుష్మా ప్రత్యేకత అని అద్వానీ తెలిపారు.
Next Story